Kitchenvantalu

Pudina Dal Tadka Recipe:దాబా స్టైల్ పుదీనా దాల్ తడ్కా.. ఇంట్లోనే ఈజీగా కమ్మని రుచితో..

Pudina Dal Tadka: వంటల్లో చివరగా,అలంకరణ గా,సువాసన కోసం వేసుకునే పుదీనా రుచికి పెసర పప్పు జోడించి చూడండి. చపాతి అన్నంలోకి సూటయ్యే పుదీనా దాల్ తడ్కా ఎలా ఉంటుందో.

కావాల్సిన పదార్ధాలు
పప్పు కోసం..
పెసర పప్పు – 1 కప్పు
నీళ్లు – 2.5 కప్పు
తాలింపు కోసం..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
ఎండుమిర్చి – 2
ఉల్లిపాయ తరుగు -1/2 కప్పు
కారం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పుదీనా ఆకులు -50 గ్రాములు
నిమ్మరసం – 1.5-2 టేబుల్ స్పూన్స్
నీళ్లు – తగినన్ని

తయారీ విధానం
1.పెసర పప్పు లోఫ్లెమ్ పై దోరగా వేపుకోవాలి.
2.వేగిన పప్పులో నీళ్లు వేసి మెత్తగా ఉడకనివ్వాలి.
3.నెయ్యి బాగా వేడి చేసి అందులో ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,ఇంగువ,మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ తరుగు ,పసుపు,పుదీనా ఆకులు వేసుకోని బాగా వేగనివ్వాలి.

5.అందులోకి ఉప్పు ,కారం వేసి వేగనివ్వాలి.
6.వేగిన తాలింపులో మెత్తగా ఉడికించిన పప్పు తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
7.బాగా ఉడికి దగ్గర పడ్డ పప్పులో నిమ్మరసం కలిపి బాగా కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే ఘుమ ఘుమ లాడే పుదీనా దాల్ తడ్కా రెడీ అయినట్టే.