Kitchenvantalu

Saggubiyyam dosa Recipe:సగ్గుబియ్యం అట్లు గుండ్రంగా రుచిగా రావాలంటే పిండి ఇలా కలపాలి

Saggubiyyam dosa: మినపప్పుతో రకరకాల దోశలు వేస్తుంటాం కదా. అప్పుడప్పుడు రవ్వ దోశ కూడ ట్రై చేస్తాం. అలాగే సగ్గుబియ్యం తో కూడ ఈసారి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
బియ్యం – 1 కప్పు
పెరుగు – ¼ కప్పు
అల్లం – ½ ఇంచ్
పచ్చిమిర్చి – 1
ఉప్పు – తగినంత
ఉల్లిపాయ తరుగు – ¼ కప్పు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నీళ్లు – సరిపడా
నూనె – దోశలు కాల్చాడానికి సరిపడా

తయారీ విధానం
1.సగ్గుబియ్యం,బియ్యం విడివిడి గా నానబెట్టుకోవాలి.
2.నానిన సగ్గు బియ్యం,బియ్యాన్ని వడగట్టి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
3.అల్లం,పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి.
4.రుబ్బుకున్న పిండిలోకి పెరుగు ,అల్లం,పచ్చిమిర్చి పేస్ట్,ఉల్లిపాయ తరుగు,కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

5.అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవాలి.
6. దోశల పెనం బాగా వేడెక్కాక గరిటడు పిండిని వేసి స్ప్రైడ్ చేసుకోవాలి.
7.అంచుల వెంట నూనె పోసుకోని ఎర్రగా కాల్చుకోవాలి.
8.ఒక వైపు కాలిన తర్వాత దోశను రెండు వైపు టర్న్ చేసుకోని దోరగా కాల్చుకోవాలి.
9.అంతే సగ్గుబియ్యం దోశ రెడీ.