Kitchenvantalu

Restaurant Style Dahi kebab Recipe:పెరుగుతో రెస్టారెంట్స్ కంటే బెస్ట్ వెజ్ కబాబ్.. రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు

Restaurant Style Dahi kebab Recipe: గెస్ట్ లు ఇంటికి వచ్చినప్పుడు వాల్లని ఇంప్రెస్ చేయాలంటే మన స్టైల్లో ఏదైనా వెరైటీ చేసి పెట్టి సర్ ఫ్రైజ్ చేయాలి అనుకుంటాం. అయితే ఈ సారి దహీ కబాబ్ తో సర్ప్రైజ్ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
చిక్కని పెరుగు – ½ లీటర్
పచ్చిమిర్చి – 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1 టేబుల్ స్పూన్
అల్లం – ½ టేబుల్ స్పూన్
ఉప్పు – కొద్దిగా
చాట్ మసాల – ½ టేబుల్ స్పూన్
శగనగ పిండి – 2-3 టేబుల్ స్పూన్
పనీర్ తురుము – ½ కప్పు
చీస్ తురుము – ½ కప్పు
నూనె – ఫ్రై కి సరిపడా
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.చిక్కటి పెరుగును క్లాత్ వేసి మూట కట్టి జల్లెడ లో పెట్టి పైన బరువును ఉంచి రాత్రంత ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
2.పనీర్ లా గడ్డకట్టిన పెరుగులో మిగిలిన పదార్ధాలు బ్రెడ్ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
3.పెద్ద నిమ్మకాయంత పిండి ముద్దను తీసుకోని బిస్కేట్ మాదిరిగా వత్తుకోని బ్రెడ్ పొడిలో నెమ్మదిగా రోల్ చేసుకోవాలి.

4.బ్రెడ్ పొడి బాగా కోటింగ్ ఇచ్చిన తర్వాత గంట సేపైనా ఉంచితే కబాబ్లు గట్టి పడ్తాయి.
5.గట్టిపడ్డ కబాబ్ లను వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ పై ఎర్రగా వేపుకోవాలి.
6.రెండు వైపుల వేగిన దహి కబాబ్ లను జల్లి గరిట సాయంతో తీసుకోని సర్వ్ చేసుకోవాలి.