Kitchenvantalu

Karnataka special Cabbage Kurma Recipe:వంట రాని వాళ్ళు కూడా చాలా రుచిగా క్యాబేజీ కుర్మాని చేసుకోవచ్చు

Karnataka special Cabbage Kurma: క్యాబేజీ అంటే చాలా మంది అయిష్టాన్ని ప్రదర్శిస్తారు. ఏదో వెరైటీ ఫాలో అయితే తప్పితే, క్యాబేజీ కర్రీని ఇష్టపడరు. చప్పటి క్యాబేజీలోకి ఘాటు మసాలాతో కర్నాటక స్టైల్ క్యాబేజ్ కుర్మా చేసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మసాలా పేస్ట్ కోసం..
పచ్చికొబ్బరి తురుము – 1కప్పు
పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 3
దాల్చిన చెక్క – 1 ఇంచ్
నీళ్లు – గ్రైండ్ చేసుకోవడానికి

కుర్మా కోసం..
క్యాబేజీ – 350 గ్రాములు
నూనె – 3 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయ – 1 కప్పు
ఉప్పు – తగినంత
టమాటో – 1 కప్పు
నీళ్లు – 1 కప్పు
కొత్తిమీర – కొద్దిగా
గరం మసాలా – 1/2టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని, మిక్సీ లోకి వేసి, నీళ్లు కలిపి, మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, జీలకర్ర, కరివేపాకు, వేసి, అందులోకి ఉల్లిపాయ తరుగు వేసుకుని, వేపుకోవాలి.
3.మగ్గిన ఉల్లిపాయల్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, వేపుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేయాలి.

4. టమాటాలు మగ్గిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి, ఉడకనివ్వాలి.
5. తర్వాత, క్యాబేజీ తరుగు, ఉప్పు వేసి, కలిపి, మరో ½ కప్పు నీళ్లు పోసి, మూత పెట్టి, మీడియం ఫ్లేమ్ పై, కాసేపు మగ్గనివ్వాలి.
6.క్యాబేజీ మెత్తపడిన తర్వాత, అందులోకి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.