Healthhealth tips in telugu

Mangoes:ఫ్రిజ్‌ నుండి మామిడి పండ్లను తీసిన తర్వాత 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి…ఎందుకు…?

Mangoes in Summer: వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనలో చాలామందికి మామిడిపండు అంటే చాలా ఇష్టం. ఏ సీజన్లో వచ్చే ఆ పండు తింటే ఆ సీజన్లో వచ్చే సమస్యలు తగ్గుతాయని నిపుణులు మరియు మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అయితే మామిడిపండును ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాం.
mango
అలా ఫ్రిజ్లో పెట్టినప్పుడు ఫ్రిజ్ లో నుంచి బయటకు తీసిన వెంటనే మామిడిపండును తినకూడదు. ఫ్రిజ్ లో నుంచి బయటకు తీసి నీటిలో కాసేపు నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మామిడిపండు ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే నీటిలో వేయటం వలన కూలింగ్ తగ్గి వేడి చేయకుండా ఉంటుంది. మామిడిపండును తినటం వలన శరీరంలో వేడి పెరుగుతుంది.
Mango benefits
శరీరంలో వేడి పెరగకుండా ఉండాలంటే మామిడికాయను తినటానికి ముందు అరగంట నానబెట్టడం మంచిది. మామిడిపండులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. మామిడిపండును అరగంట సేపు నానబెట్టడం వలన పైటో కెమికల్స్ గాడత తగ్గుతుంది. ఇవి అదనపు వేడిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే నీటిలో నానబెట్టటం వలన మామిడి పండు తోక్కపై ఉండే టానిన్లు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.