Healthhealth tips in telugu

Mangoes:రసాయనాలతో పండిన మామిడి పండ్లను గుర్తించండి ఇలా..చాలా సింపుల్

How to know if Mango is Naturally Ripe :వేసవి కాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో మామిడి పండ్లు చాలా విరివిగా లభిమవుతాయి. అయితే చాలామంది వ్యాపారస్తులు మామిడికాయలకు రసాయనాలను ఇంజెక్ట్ చేస్తూ కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండిన పండ్లను తింటే ఏరి కోరి మనం సమస్యలను తెచ్చుకున్నట్టే. అయితే మనం మామిడి పండ్లు కొనే సమయాల్లో అవి రసాయనాలతో పండించారా… లేదా అనేది ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

వేసవికాలంలో ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను కొంటూ ఉంటారు. మామిడి పండ్లలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కృత్రిమంగా పండిన మామిడికాయ తింటున్నప్పుడు నాలుక మొగ్గ కొద్దిగా మంటగా అనిపిస్తుంది. అలాగే రుచిలో కూడా తేడా ఉంటుంది. గొంతు మంట వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కడుపునొప్పి, విరేచనాలు కలుగుతాయి.

రసాయనాలతో పండిన మామిడి పండ్లలో రసం చాలా తక్కువగా ఉంటుంది. మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో వేసి గమనించాలి. మామిడిపండ్లు నీటిపై తేలితే రసాయనాలతో పండినవి అని అర్థం. సాధారణంగా వ్యాపారస్తులు కాల్షియం కార్బైడ్‌ను మామిడిపండ్లలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీంతో అవి త్వరగా పండుతాయి. అయితే ఈ పండ్లను తింటే చర్మ, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.