Healthhealth tips in telugu

Bendakaya:బెండకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా…అసలు నమ్మలేరు

Bendakaya Health benefits In telugu : బెండకాయను చాలా పూర్వకాలం నుండి వాడుతున్నారు. బెండకాయను ఓక్రా అని కూడా పిలుస్తారు. బెండకాయలో ఉన్న పోషక విలువలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. బెండకాయలో పీచు (9%), ఫోలేట్, పిరిడోక్సైన్, థియామిన్, రాగి, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ మరియు భాస్వరం, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె ఉంటాయి.
Bendakaya Benefits In telugu
ఇవన్నీ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ఇప్పుడు బెండకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.బెండకాయలో యూగేనోల్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రవాహంలో చక్కెర శోషణ నిదానంగా అయ్యేలా చేస్తుంది. దాంతో రక్తంలో చక్కర స్థాయిలు స్థిరీకరణ జరిగి మధుమేహం అదుపులో ఉంటుంది.
gas troble home remedies
బెండకాయలో ఉండే పెక్టిన్ ప్రేగుల్లోని వ్యర్ధాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. అందువల్ల బెండకాయను రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి బయట పడవచ్చు. ఎక్కువ ఫైబర్,తక్కువ కేలరీలు ఉండుట వలన బరువు తగ్గాలని అనుకునేవారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.
Immunity foods
బెండకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంలో సహాయపడుతుంది. బెండకాయలో ఇనుము మరియు ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. బెండకాయను చుండ్రు మరియు పేల చికిత్సలో ఇంటి ఔషధంగా ఉపయోగిస్తారు.
hair fall tips in telugu
బెండకాయలను చక్రాల్లా కోసి నీటిలో మరిగించి, నీటిని వడకట్టి నిమ్మరసం కలిపి జుట్టుకి రాస్తే జుట్టుకు మెరుపు వస్తుంది. వారంలో రెండు సార్లు బెండకాయను తింటే సరిపోతుంది. బెండకాయను వేపుడుగా కాకుండా కూరగా ఉడికించి తింటే మంచిది. అలాగే రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో బెండకాయను ముక్కలుగా కట్ చేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.