Healthhealth tips in telugu

Raw almond Vs Soaked almonds:నానబెట్టిన బాదం పప్పు Vs ముడి బాదం పప్పు…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది

Raw almond Vs Soaked almonds:నానబెట్టిన బాదం పప్పు Vs ముడి బాదం పప్పు…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది.. బాదం పప్పులో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టి డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకుంటున్నారు. అయితే బాదం పప్పు ముడిగా తింటే మంచిదా…నానబెట్టి తింటే మంచిదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.
Almond Face Tips
బాదం పప్పులో ప్రోటీన్, ఫైబర్ మరియు ఒమేగా 3 వంటివి సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పును నీటిలో నానబెట్టి పై తొక్క తీసి తింటే ముడి బాదం పప్పు కన్నా ఎక్కువగా పోషకాలు మన శరీరానికి అందుతాయి. బాదం పప్పు పై తొక్కలో టానిన్ ఉంటుంది, ఇది పోషకాల శోషణను నిరోధిస్తుంది. బాదంపప్పును నానబెట్టడం వల్ల పై తొక్క తీయడం సులభం అవుతుంది.

నానబెట్టిన బాదం మెత్తగా మరియు సులభంగా జీర్ణమవుతుంది. అలాగే బాదం పప్పులో ఉన్న పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి. బాదంపప్పును ఐదు నుండి ఆరు గంటలు నానబెడితే సరిపోతుంది. కానీ మనలో చాలా మంది రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటూ ఉంటారు. ఈ రెండు పద్దతుల్లో ఏది ఫాలో అయినా పర్వాలేదు.
Diabetes patients eat almonds In Telugu
బాదంపప్పులో విటమిన్ ఇ, డైటరీ ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రొటీన్లు వంటి వివిధ రకాల పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన బాదంపప్పును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ప్రోటీన్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. అలాగే బాదంపప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆకలిని నియంత్రిస్తాయి.

బాదంలో ఉండే మాంగనీస్ ఎముకలను బలోపేతం చేయడానికి మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండటానికి మరియు కండరాలు మరియు నరాల పనితీరుకు సహాయపడుతుంది. నానబెట్టిన బాదం లైపేస్ అనే ఎంజైమ్‌లను విడుదల చేయడంలో సహాయపడి కొవ్వుల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
cholesterol reduce foods
బాదంలో ఉన్న పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బాదంపప్పులోని విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నిరోధిస్తుంది. బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.