Beauty Tips

Face Glow Tips:గుడ్డుతో ఇలా చేస్తే ఎలాంటి ముఖం అయినా తెల్లగా మారాల్సిందే..!

Face Glow Tips: ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా పలితం పెద్దగా రాక నిరాశకు గురి అవుతూ ఉంటారు.

అలాంటి వారు ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు,ముడతలు అన్నీ మాయం అయ్యి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో egg పచ్చ సోన తీసుకోని బాగా గిలకొట్టాలి. దానిలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా మెరుస్తుంది. అలాగే ముఖం మీద దుమ్ము,ధూళి కారణంగా వచ్చే తాన్ కూడా తొలగిపోతుంది. కేవలం రెండు ఇంగ్రిడియన్స్ తో ముఖం మెరిసేలా చేసుకోవచ్చు.

ఈ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి లోతుగా మరమ్మత్తు చేస్తుంది. అంతేకాకుండా చర్మానికి అవసరమైన తేమను అందించి పొడిగా లేకుండా చేస్తుంది.

పచ్చసొన, తేనెలో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందించి చర్మం మెరిసేలా చేయటానికి సహాయపడతాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News