Healthhealth tips in telugu

Black Carrot :బ్లాక్ క్యారెట్ ఎప్పుడైనా తిన్నారా… ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Black Carrot Benefits In telugu : మనలో చాలామంది క్యారెట్లను చాలా ఇష్టంగా తింటారు. అయితే మనం తినే క్యారెట్లు నారింజ రంగులు నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటాయి. అయితే నలుపు రంగులో ఉండే క్యారెట్స్ కూడా ఈ మధ్యకాలంలో లభిస్తున్నాయి. ఈ నలుపు రంగులో ఉండే క్యారెట్స్ కాస్త తీయగాను కాస్త కారంగాను ఉంటాయి. .
Black carrot
బ్లాక్ క్యారెట్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక పోషకాల విషయానికి వస్తే…కాల్షియం, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, జింక్‌, విట‌మిన్ ఇ, విటమిన్ కె, విమ‌ట‌న్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
blood thinning
ముఖ్యంగా ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఒక క్యారెట్ తీసుకుంటే ఆ సమస్య నుండి తొందరగా బయట పడతారు. బ్లాక్ క్యారెట్ ఆంథోసైనిన్స్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడంలో మరియు ధమనులను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
Brain Foods
దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ Orange క్యారెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరచి అల్జీమర్స్ వ‌చ్చే రిస్క్‌ను తగ్గించి ఆలోచ‌నా శ‌క్తి, జ్ఞాప‌క శక్తిని పెంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
Joint Pains
బ్లాక్ క్యారెట్‌లోని కొన్ని క్రియాశీల పదార్ధాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, అలాగే యాంటీఆక్సిడెంట్ సామర్ధ్యాలను కలిగి ఉంటాయి, ఇవి దీర్ఘకాలిక వ్యాధులు మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
eye sight remedies
కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే కంటి చూపు సమస్యలు,శుక్లం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో శరీరంలో ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ విడుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి బ్లాక్ క్యారెట్ లో ఉన్న ప్రయోజనాలను పొందటానికి తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.