Healthhealth tips in telugu

Black Pepper:నల్ల మిరియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో…

Black Pepper and jaggery Benefits: ఘాటుగా ఉండే మిరియాలు, తియ్యగా ఉండే బెల్లంలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలగటమే కాకుండా ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఎన్నో సమస్యలను మన వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. బెల్లం, నల్ల మిరియాల్లో ఎక్కువగా వేడి చేసే లక్షణం ఉంటుంది. అందువలన ఈ చలికాలంలో …ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వచ్చేస్తాయి.

ఒక్కసారి వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. 3 మిరియాల గింజలు కొంచెం బెల్లం తీసుకుని ఈ రెండింటినీ కలిపి పేస్ట్ గా చేసి తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి అన్ని తగ్గిపోతాయి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. కొంతమందికి ముక్కునుండి రక్తం కారుతూ ఉంటుంది.

ఈ సమస్య తగ్గాలంటే పెరుగులో కొంచెం బెల్లం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే ముక్కు నుండి రక్తం కారటం తగ్గిపోతుంది. ఈ మిశ్రమం తలనొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు బెల్లం, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

మిరియాలలో ఉండే లక్షణాలు కీళ్ల నొప్పులు తగ్గించటానికి సహాయపడుతుంది. నల్ల మిరియాలలో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జీర్ణప్రక్రియ బాగా సాగి పొట్టకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, బెల్లం మరియు నల్ల మిరియాలను ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. తగిన మోతాదులో తీసుకుంటే ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. కాబట్టి ఈ సీజన్ లో తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.