Beauty Tips

Hair Care Tips:జుట్టు రాలకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పెరగాలంటే బెస్ట్ టిప్స్

Hair Care Tips:ప్రతి అమ్మాయి జుట్టు అందంగా పొడువుగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలు అయినా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోతారు. అయితే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా ఉండేలా చేసుకోవచ్చు.

నువ్వుల నూనెను తలకు బాగా పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసే అరగంటయ్యాక కుంకుడు కాయతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

కొబ్బరినూనెలో మందార పూలు వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

మందార ఆకులు కూడా జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం అందిస్తాయి.మందార ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్టులా చేసి తలకు పట్టించి అరగంటయ్యాక షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.