Beauty Tips

Dandruff:చుండ్రుని తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ఇవే..

Dandruff:కాసింత బేకింగ్ సోడాని తీసుకుని తడి జుట్టుకి బాగా రాయాలి.. ఇలా రెండు నిమిషాల పాటు బాగా మర్దనా చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకి ఓసారి చేయడం వల్ల చుండ్ర సమస్య తగ్గిపోతుంది.

అయితే, మరీ ఎక్కువగా బేకింగ్ సోడాను వాడొద్దు. కాసింత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.వెనిగర్‌తోనూ ఈ సమస్యని తగ్గించుకోవచ్చు. అందుకోసం ఆరు చెంచాల నీటిలో 2 చెంచాల వెనిగర్ కలిపాలి. ఇప్పుడు షాంపూతో తలస్నానం చేశాక ఆ నీటితో తలని కడగాలి.

వారానికి ఓ సారి ఇలా చేయడం వల్ల త్వరలోనే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.పుల్లగా ఉండే పెరుగులో నిమ్మరసంలు కలిపి తలకు రాయాలి. ఆరాక తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే తలలోని చుండ్రు దూరమవ్వడమే కాకుండా జుట్టు కూడా కాంతులీనుతూ ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా చుండ్రు సమస్యని తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్‌ని షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాయాలి. ఇలా చేసిన తర్వాత ఇబ్బంది లేదనుకుంటే రాత్రంతా ఉంచేసుకోవచ్చు. లేదా అరగంట తర్వాత తలస్నానం చేసేయొచ్చు. ఈ రెమిడీ కూడా డాండ్రఫ్‌ని పోగొట్టడంలో భేషుగ్గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.