Kitchenvantalu

Saggubiyyam Kesari Recipe :ఏ పండగకైనా సులువుగా చేసుకునే కమ్మనైనా సగ్గుబియ్యం కేసరి..

Saggubiyyam Kesari Recipe :సగ్గుబియ్యం కేసరి.. పండుగలైనా,ఏదైనా స్పెషల్ అకేషన్స్ అయినా స్వీట్ కంపల్సరీ. సేమియా ,రవ్వకేసరి,పరమాన్నం రెగ్యులర్ గా చేస్తుంటాం. సగ్గుబియ్యంతో కేసరి తయారు చేసేయండి .డిఫరెంట్ టేస్టీగా అందరు నచ్చేలే ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
సగ్గు బియ్యం – 1 కప్పు
చక్కెర – ½ కప్పు
యాలకుల పొడి – ½ టీ స్పూన్
డ్రై ఫ్రూట్స్ – సరిపడా

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒకటి,రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.
2.నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మునిగే వరకు నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
3.ఉడికిన సగ్గుబియ్యాన్ని వడగట్టుకోవాలి.
4.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బటర్ వేసి కరగనివ్వాలి.

5.బటర్ వేడెక్కాక అందులోకి వడకట్టుకున్న ఉడకిన సగ్గుబియ్యాన్ని వేసి వేపుకోవాలి.
6.మరికాస్త బటర్ వేస్తు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి.
7.అందులోకి పంచదార వేసి కలుపుతూ కరిగి కాస్తా జారుగా తయారౌతుంది.
8.అలాగే కలుపుతూ చిక్కపడే వరకు ఉడికించుకోవాలి.
9.అందులోకి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10.చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కేసరి రెడీ.