Healthhealth tips in telugu

Good Health:చక్కని ఆరోగ్యానికి పాటించవలసిన 10 సూత్రాలు

Good Health:అవసరానికి కన్నా అధికంగా తినటం అలవాటు అయిన వారికీ కడుపులో జీర్ణాశయం గోడలపై వాపు తరహ ఇన్ ఫ్లమేషన్ తలెత్తి…… అజీర్తి,ఆకలి పెరగటం,పేగుల్లో చిరాకు,బరువు పెరగటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆహార అలవాట్లు,జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు తీసుకురావటం ద్వారా ఆరోగ్యంలో,శరీర ఆకృతిలో పెద్ద పెద్ద మార్పులే తీసుకురావచ్చు.

1. ప్రతి రోజు ఒక గ్లాస్ పచ్చి కూరగాయాల జ్యూస్ త్రాగటం చాలా మంచిది. క్యారట్,ఉసిరి,కూరగాయల జ్యూస్ లలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తూ ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తాయి.

2. మాంసకృత్తులను సరిపడా తీసుకోవాలి. ఇవి కణజాలంనకు మరమత్తులు చేస్తాయి. అలాగే ఎముకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి.

3. బీటా కెరోటిన్,విటమిన్ సి,విటమిన్ కూరగాయలు,గింజలు రోజువారీ ఆహారంలో తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

4. ఆరోగ్యంగా,చక్కగా ఉండటం అనేది శరీర ఆకృతి చక్కగా ఉన్నది అనటానికి సంకేతం. తక్కువ తినటం ద్వారా వృద్దాప్య చాయలు నెమ్మదిస్తాయి.

5. వారంలో ఒక రోజు ఏమి తినకుండా కేవలం పచ్చి కూరగాయ ముక్కలు మాత్రమే తినవచ్చు. అధిక బరువు సమస్యతో బాధ పడేవారికి చక్కని మార్గం.

6. ఒక నెలలో 500 మిల్లి లీటర్ కన్నా ఎక్కువ నూనె వాడకూడదు. అయితే ఆలివ్,తవుడు,నువ్వులు,పొద్దు తిరుగుడు,ఆవ నూనెలు మంచివి. చక్కర ఎక్కువగా ఉన్న పదార్దాలు,వేపుళ్ళు తగ్గించటం ద్వారా కూడా వృద్దాప్య ఛాయలు నెమ్మదిస్తాయి.

7. ఒత్తిడిని నియంత్రించాలి. వ్యాధులకు కారణమయ్యే వాటిలో మనసు కూడా ఒకటి. ఒత్తిడి రోగనిరోదక వ్యవస్థ ను నొక్కి పెడుతుంది.

8. కుటుంబ సభ్యులు,స్నేహితులు,పెంపుడు జంతువులతో అనుభందం పెంచుకోవాలి. ఇది రోగనిరోదక వ్యవస్థ ను ప్రేరేపిస్తుంది.

9. వారానికి ఐదు రోజులు 30-40 నిముషాలు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వలన నిల్వ ఉండే విషపదార్దాలు బయటకు పోతాయి. ఏరోబిక్ వ్యాయామాలు జీర్ణ శక్తిని,జీవక్రియలను పెంచుతాయి.

10. పొగ తాగటం మానటం ద్వారా ఆరోగ్యానికి మరింత బలాన్ని అందించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.