Kitchenvantalu

Home Remedies:తేనీటీగ దద్దుర్లకు అద్భుతమైన ఇంటి చిట్కాలు

Honey bee bite home remedies:తేనెటీగ కుట్టిందంటే మంట,నొప్పి విపరీతంగా వస్తుంది. తేనెటీగ కాటుకు మందులు ఉన్నప్పటికీ ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తేనే
తేనెలో యాంటీ బాక్టీరియల్ మరియు రోగనిరోధక లక్షణాలు ఉండుట వలన తేనెకు మంట మరియు వాపును తగ్గించే లక్షణం ఉంది. ఇది గాయాన్ని త్వరగా నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. తేనెటీగ కుట్టిన ప్రాంతంలో తేనెను రాసి అరగంట తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సిడార్ వెనిగర్
తేనెటీగ విషం యొక్క విష సమ్మేళనాలను తటస్తం చేయడం ద్వారా వాపు మరియు నొప్పిని తగ్గించటానికి ఆపిల్ సిడార్ వెనిగర్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ప్రాసెస్ చేయకుండా ఉన్న ముడి ఆపిల్ సిడార్ వెనిగర్ ని వాడటంమంచిది . కొంచెం దూది తీసుకొని కొంత ముడి ఆపిల్ సిడార్ వెనిగర్‌లో నానబెట్టండి. ఆ దూదిని కుట్టిన ప్రాంతంలో కొంతసేపు ఉంచండి.