Kitchenvantalu

Kitchen Hacks:పాత్రలపై పసుపు మరకలు వదలాలంటే…ఈ సింపుల్ చిట్కాలు Try చేయండి

Turmeric stains on utensils:పసుపులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల మనం ప్రతిరోజు ఏదోరకంగా పసుపును తీసుకుంటూ ఉంటాం. కొంతమంది పసుపును కూరల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. కొంతకాలానికి కూరలు వండిన పాత్ర లోపలి వైపు పసుపచ్చగా మారిపోతుంది.

అలాగే జిడ్డుగా మారి మెరుపు కూడా కోల్పోతుంది. ఈ పసుపు పచ్చని మరకలు ఎంత రుద్దిన ఒక పట్టాన వదలవు.ఈ మొండి మరకలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

రెండు కప్పుల నీటికి పావు కప్పు గ్లిజరిన్, పావు కప్పు లిక్విడ్ సోప్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఒక క్లాత్ ముంచి పసుపు మరక ఉన్న పాత్ర లోపలి భాగంలో రాసి పది నిమిషాలు అయ్యాక రుద్ది కడిగితే మరక వదిలిపోతుంది.

రెండు వంతుల నీటిలో ఒక వంతు నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని పసుపు మరక ఉన్న పాత్రలో నింపాలి. రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తే సరిపోతుంది. నిమ్మలో సహజసిద్దమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన మరకలను తొలగించటానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.