Kitchenvantalu

Oatmeal Coconut Cake:ఓట్స్‌ కోకోనట్‌ కేక్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు…బేకరికి వెళ్ళరు

Oatmeal Coconut Cake: పిల్లలు Cake అంటే చాలా ఇష్టంగా తింటారు. బేకరికి వెళ్లి తినటానికి పిల్లలు ఇష్టపడతారు. అదే మన ఇంటిలో బేకరి స్టైల్ లో కేకు తయారుచేస్తే చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ కేక్ తయారి కావలసిన పదార్ధాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు
ఓట్స్‌ పొడి – ఒకటిన్నర కప్పులు, కొబ్బరి పాలు – పావు లీటర్‌, కొబ్బరి తురుము – 1 కప్పు, బ్రెడ్ పొడి – ఒక కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు, నీళ్లు – 2 కప్పులు

తయారి విధానం
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి కొబ్బరి పాలు, పంచదార వేసి పంచదార కరిగే వరకు తిప్పి…ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేయాలి. ఒక బౌల్ లో ఓట్స్‌ పొడి, బ్రెడ్ పొడి వేసి కొద్ది కొద్దిగా కొబ్బరి పాల మిశ్రమాన్ని పోస్తూ బాగా కలిసేలా కలపాలి.

ఆ తర్వాత కొబ్బరి తురుము, బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కేక్ తయారు చేసే పాత్రలో పోసి ఓవెన్‌లో బెక్ చేయాలి. క్రీమ్స్‌తో గార్నిష్‌ చేయాలి. ఎంతో రుచికరమైన Oatmeal Coconut Cake రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News