Kitchenvantalu

Gutti Kakarakaya Curry Recipe:చేదు రాకుండా కమ్మని రుచితో గుత్తి కాకరకాయ.. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Gutti Kakarakaya Curry Recipe:గుత్తి కాకరకాయ కర్రీ.. రుచిలో చేదుగా ఉండే కాకరకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. వారం లో ఒక సారైనా కాకరకాయ తింటే ఎంతో మంచిది.కాకరకాయ వెరెటీలో గుత్తి కాకరకాయ ఓ సారి ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – ¼ kg
పల్లీలు – 3-4
ఎండుమిర్చి – 7-8
జీలకర్ర – 1 టీ స్పూన్
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 5-6
చింతపండు – 5-6 గ్రాములు
ఉల్లిపాయలు – 1
ఆవాలు – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం
1.ముందుగా కాకరకాయల కొనలను కట్ చేసుకోని నిలువుగా గాటు పెల్లుకోవాలి.
2.వేరొక గిన్నెలో కొద్దిగా నీళ్లు ,ఉప్పు వేసి కట్ చేసుకున్న కాకరకాయలను అందులో వేసుకోవాలి.
3. నీళ్లతో పాటు మూత పెట్టి ఐదారు నిమిషాలు కాకరకాయలను ఉడకనివ్వండి.
4.ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి పల్లీలు,ఎండుమిర్చి,జీలకర్ర,కొత్తిమీర వేసి వేపుకోవాలి.
5.స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారకా మిక్సి జార్ లో వేసుకోని అందులోకి వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పువేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

6.ఇప్పుడు ఉడకపెట్టుకున్న కాకరకాయలను చల్లారక విత్తనాలను తొలగించాలి.
7.ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసుకున్న స్టఫ్ ని కాకరకాయలో ఫిల్ చేయాలి.
8.ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి ఆవాలు వేసి వేగనివ్వాలి.
9.ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేపుకోవాలి.
10.ఉల్లిపాయలు వేగాక పసుపు వేసి కలుపుకోని కాకరకాయలను వేసి,మిగిలిన స్టఫ్ ని కూడ వేసి కలిపి మూతపెట్టి రెండు ,మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
11.ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసి గ్రేవికి సరిపడా నీళ్లను పోసి లో ఫ్లేమ్ పై పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి.
12.గ్రేవి చిక్కపడే వరకు, నూనె పైకి తేలేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి కాకరకాయ రెడీ.