Healthhealth tips in telugu

Coriander:కొత్తిమీరతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్య పోతారు

Coriander Health benefits:కూరలో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. చాలామంది కూరల్లో కొత్తిమీరను రుచికోసం వేస్తూ ఉంటారు. అయితే కొత్తిమీరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి పెద్దగా తెలియదు. మంచిది కదా అని వేస్తూ ఉంటారు.

కొంతమంది కొత్తిమీర వాసన పడదు అందువల్ల కూరల్లో వేయరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కొత్తిమీర ను వాడటం ప్రారంభిస్తారు. ఇప్పుడు కొత్తిమీర లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. కొత్తిమీర లో ఉన్న లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి.

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం లో చాలా బాగా హెల్ప్ చేస్తుంది కొత్తిమీర. కొత్తిమీర లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల కడుపులో మంట వంటివి తగ్గుతాయి. కొత్తిమీర ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు అంటే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం ఉన్నవారు రెగ్యులర్ డైట్ లో కొత్తిమీర ను వాడితే మంచి ఫలితం కనబడుతుంది.

కొత్తిమీర ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా సహాయపడుతుంది. దద్దుర్లు మచ్చలు చర్మంపై వచ్చినప్పుడు కొత్తిమీర రసాన్ని లేదా పేస్టుని రాస్తే తొందరగా నయమవుతాయి. చూశారుగా కొంచెమే లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో… ఇక మీరు కూడా కొద్ది మీరు తిని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.