Healthhealth tips in telugu

Egg:ఆరోగ్యానికి గుడ్డు ఎంత ముఖ్యమో తెలుసా…ఇది చూస్తే అర్ధం అవుతుంది

Egg Health Benefits In telugu:చౌక ధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరంలో HDL కొలస్ట్రాల్ ను పెంచుతుంది. అంటే శరీరానికి మేలు చేసే కొవ్వు అన్న మాట. దీన్ని ప్రతి రోజు ఆహారంలో చేర్చుకొంటే రక్త నాళాలు మరియు గుండె జబ్బులు దరి చేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

రోజు గుడ్డు తీసుకోవటం వలన దానిలో ఉండే పోషకాలు రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తాయి. గుడ్డులో లభించే కెరోటినాయిడ్స్ ల్యూటిన్,జేక్సటిన్ అనే పోషకాలు కంటి సంబదిత సమస్యలను దూరం చేస్తుంది.

ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల అత్యదికమైన మరియు నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. తొమ్మిది రకాల శరీర అవయవాల పనితీరుకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సోనలో 300 మైక్రో గ్రాముల కొలైన్ లభిస్తుంది.

ఈ పోషకం మెదడు పనితీరు,నరాల వ్యవస్థ బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అంతేకాకుండా సహజసిద్దంగా లభించే D విటమిన్ కూడా లభిస్తుంది. ఒక సర్వేలో వారంలో కనీసం ఆరు కోడిగుడ్డ్లు తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు 44 శాతం తగ్గుతుందని తేలింది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.