Healthhealth tips in telugu

Pregnant women:గర్భవతులు ఒత్తిడిని అదికమించటం ఎలా … ఈ టిప్స్ ఫాలో అయితే సరి

Pregnant women:స్త్రీలలో ఒత్తిడి,ఆందోళన అనేవి సర్వ సాదారణంగా ఉంటాయి. ఈ రెండు మాములు వ్యక్తుల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు. అయితే గర్భిణిలలో ఒత్తిడి,ఆందోళన తల్లి మీదే కాకుండా పుట్టబోయే బిడ్డ మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. స్త్రీ గర్భం ధరించిన సమయంలో శారీరక మార్పులతో పాటు హార్మోన్ లలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటాయి.

హార్మోన్ లలో కలిగే మార్పుల వలన ఒత్తిడి,ఆందోళన కలుగుతాయి. ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులు,పుట్టబోయే శిశువు గురించి ఆలోచనలు,కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు గర్భిణిలను తీవ్ర ఆందోళన,ఒత్తిడి కి గురి చేస్తాయని చెప్పవచ్చు.

ఒత్తిడి అనేది తల్లితో పాటు గర్భస్థ శిశువు మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. శిశువు అతి తక్కువ బరువుతో జన్మించటం,అవయవాల ఎదుగుదల లోపాలతో పాటు కొన్ని సార్లు మెదడు మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చాల తక్కువ ఐక్యు తో శిశువు జన్మించటానికి ఒత్తిడి కారణమని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.

గర్భవతులు ఒత్తిడి మరియు ఆందోళనకు గురి అయినప్పుడు మంచి పోషకాహారం తీసుకోవటం వలన ఒత్తిడి,నీరసం, నిస్తేజం తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకుంటారు. శారీరక,మానసిక ప్రసాంతత కలగాలంటే యోగ చాలా ఉపయోగపడుతుంది. యోగ తర్వాత స్లో జాగింగ్ బాగా సహాయపడుతుంది.

ఇది రక్త ప్రసరణను రెట్టింపు చేయటమే కాకుండా మూడ్ ను మెరుగుపరచి ఒత్తిడిని తగ్గిస్తుంది. గర్భిణి స్త్రీ లకు కనీసం తొమ్మిది గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. వారు ఉద్యోగస్తులైతే ఆఫీస్,ఇంటి పనులతో ఒత్తిడికి గురి అవ్వవచ్చు. అప్పుడు మీ ఆందోళనను మీ భాగస్వామితో పాటు మీ డాక్టర్ ని సంప్రదిస్తే మెరుగైన పలితాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.