Beauty Tips

Hair Care Tips:దువ్వుకున్నా ప్రతిసారి జుట్టు రాలుతుందా…..

Hair care Tips:దువ్వుకున్నా ప్రతిసారి జుట్టు రాలటం అనేది సహజంగా అందరిలో కనిపించే సమస్యే. అయితే మరీ ఎక్కువగా ఊడితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్టే. అది ఏమిటో తెలుసుకుంటే పరిష్కారం తేలికగా కనుకోనవచ్చు.

జుట్టు ఎదుగుదల అనేది వయస్సుతో పాటు మారుతూ ఉంటుంది. మోనోపాజ్,హార్మోన్ల కొరత,పోషకాహార లోపం వంటి కారణాల వల్ల జుట్టు ఊడితే మంచి ఆహారం తీసుకోవటం ద్వారా మళ్లీ తిరిగి ఒత్తైన జుట్టును పొందవచ్చు.

రోజు ఆహారంలో మొలకెత్తిన గింజలు,ఆకుకూరలు,కూరగాయలు,చేపలు ఉండేటట్లు చూసుకోవాలి. మీ వయస్సు నలభై చేరకముందే జుట్టు రోజు ఎంతో కొంత ఊడుతూ పలచగా అయిపోతే ఒకసారి డెర్మటాలిస్ట్ ను కలిసి రక్త పరీక్షలు చేయించుకోవాలి. రక్త హీనత,ధైరాయిడ్ గ్రంధిలో మార్పులతో కూడా ఇలాంటి సమస్య ఎదురవుతుంది.

మదుమేహంతో పాటు అధికంగా స్టెరాయిడ్స్ వాడటం వలన కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఎక్కువ ఘాడత గల రంగులు వేయటం, కర్లింగ్,స్ట్రెయిటింగ్ వంటివి చేయటం,అలాగే ఎక్కువ రసాయనాలు ఉన్న షాంపూ వాడటం వలన కూడా జుట్టు ఊడిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.