Health

Health Tips:ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు

Useful health Tips:భోజనం చేసిన తర్వాత యాలకులను తింటే ఎసిడిటి సమస్య తగ్గుతుంది. రక్త పోటు అదుపులో ఉంటుంది. నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్స్ ఉన్నప్పుడు రెండు యాలకులను తింటే సమస్య తొలగిపోతుంది.

అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా సహాయాపడుతుంది. అల్లంను కొన్ని వారాల పాటు తింటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

వెల్లుల్లి రసాన్ని తలకు పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

పసుపులో కుర్కుమిన్ ఉండుట వలన జలుబు,దగ్గు నివారించడంలో సహాయపడుతుంది. చిటికెడు పసుపును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గటం ,మధుమేహం కంట్రోల్ గా ఉండటం ,కొలస్ట్రాల్ తగ్గటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.