Healthhealth tips in telugu

Black Pepper:ఆ సమయంలో మిరియాలను ఇలా తీసుకుంటే ఏ సమస్యలు రావు

Black Pepper benefits:కాలం మారిందంటే చాలు.. జలుబు, దగ్గు సమస్యలే అధికంగా కనిపిస్తాయి.ఈ సమస్యల నుండి తప్పించుకోవాలంటే ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటంటే..

మనం తీసుకొనే ఆహార పదార్ధాలపై మిరియాల పొడిని చల్లి తింటే రుచి పెరగటమే కాకుండా ఏమైనా జీర్ణ సమస్యలు ఉంటె తొలగిపోతాయి.

జలుబు,దగ్గు సమస్యలు వేదిస్తున్నప్పుడు మిరియాలు,వాములను వేగించి పొడి చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి. అలాగే ఈ పొడితో రసం లేదా చారుగా కూడా చేసుకోవచ్చు.

మిరియాలలో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ, పేగు క్యాన్సర్లని రాకుండా చూస్తాయి.

ఒత్తిడి, ఆందోళనగా ఉంటే కొంచెం మిరియాలను పొడిచేసుకుని తేనె కలిపి తీసుకోవాలి. మిరియాలలో ఉండే పైపెరైన్ ఒత్తిడి,ఆందోళన సమస్యను తగ్గిస్తుంది.

తలనొప్పి వేధిస్తుంటే రోజూ ఉదయం, సాయంత్రం మిరియాల పొడిని బెల్లంతో కలిపి తీసుకోవడం సమస్య త్వరగా పరిష్కారమవుతుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.