Healthhealth tips in telugu

Banana:అరటిపండులో ఉన్న ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

Banana Health benefits:అరటి పండు అనేది ప్రకృతి ఇచ్చిన గొప్ప అల్పాహారాల్లో ఒకటి. కానీ అది మనకు ఎంత మంచి చేస్తుందో తెలుసా? అరటిపండులో అనేక అసాదారణ ఉపయోగాలు ఉన్నాయి.

1. పొటాషియం
అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఈ ఖనిజం గుండె పనితీరును సరిగ్గా నిర్వహించడం మరియు సాధారణ రక్తపోటు నియంత్రణకు చాలా అత్యవసరం. అనేక అధ్యయనాలలో అధిక రక్తపోటును తగ్గించటానికి పొటాషియం సమృద్దిగా ఉన్న ఆహారాలు సహాయపడతాయని తెలిసింది.

US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వారు అధిక రక్తపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే సామర్ధ్యం అరటి పండుకు ఉందని అరటి ఇండస్ట్రీ ( ఫార్మాస్యూటికల్ డ్రగ్ తయారీ చేస్తారు) కి అనుమతి ఇచ్చింది.

2. ఎక్కువ శక్తి
ముదురు రంగు స్పోర్ట్స్ డ్రింక్స్, శక్తి బార్లు మరియు ఎలక్ట్రోలైట్ జెల్ (అనారోగ్యకరమైన రసాయనాలు మరియు రంగులు ఉంటాయి) వంటి వాటికీ బదులుగా క్రీడాకారులు క్రీడల సమయంలో అరటిపండును తినటం చూడవచ్చు.

3.జీర్ణక్రియకు సహాయపడుతుంది
అరటిపండులో పైబర్ సమృద్దిగా ఉంటుంది. పైబర్ తీసుకోవటం వలన ఆహార జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా సహాయపడుతుంది. అంతేకాక మలబద్ధకం చికిత్సలో అరటిపండు మంచి విరోచనకారిగా పనిచేస్తుంది. అరటిపండు లో ఫ్రుచ్తో ఒలిగోసకరైడ్లు సమృద్దిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వాహిక లో ముఖ్యమైన స్నేహపూరిత బాక్టీరియా ఫీడ్ కొరకు మరియు పోషకాలను గ్రహించడానికి సహాయం చేస్తుంది. అరటిపండులో మంటను తగ్గించే సాదనాలు ఉండుట వలన గుండె మంటను తగ్గించటంలో సహాయపడుతుంది.

4. అల్సర్
ప్రతి రోజు క్రమం తప్పకుండా అరటిపండును తింటే అల్సర్ ని తగ్గించటంలో సహాయపడుతుంది. అరటిలో ఉండే కాంపౌండ్స్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంనకు వ్యతిరేకంగా పొట్టలో ఒక మందమైన రక్షిత అవరోధంను సృష్టిస్తాయి. కడుపులో
అల్సర్ కి కారణం అయిన బాక్టీరియాను తొలగించటానికి అరటిపండులో ఉండే ప్రోటీజ్ అవరోధకాలు సహాయపడతాయి.

5.విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది
అరటిపండులో విటమిన్ B6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ ఆరోగ్యకరమైన రక్తంలో హిమోగ్లోబిన్ సృష్టించడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అమైనో ఆమ్లాల సంశ్లేషణ మరియు విడగొట్టి శరీరంలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందనకు అవసరమైన యాంటి బాడి ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక అరటి పండు తీసుకుంటే విటమిన్ B6 శరీరానికి సమృద్దిగా అందుతుంది.

6. విటమిన్లు మరియు ఖనిజాలు
అరటిపండులో అధిక స్థాయిలో పొటాషియం మరియు విటమిన్ B6 ఉండే విధంగానే విటమిన్ సి, మెగ్నీషియం మరియు మాంగనీస్ లు కూడా సమృద్దిగా ఉంటాయి. అలాగే B విటమిన్లు మరియు అయోడిన్, ఐరన్, సెలీనియం మరియు జింక్ వంటి ట్రేస్ఖ నిజాలు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి.

7. చర్మ సమస్యలు
ఈ అద్భుతమైన పండు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. అరటి తొక్కలను సోరియాసిస్ మరియు మోటిమల వంటి చర్మ సమస్యల చికిత్సకు పూతగా ఉపయోగిస్తున్నారు. అరటిపండు తొక్కను ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. రాత్రి పడుకొనే ముందు ఈ విధంగా చేస్తే మంచి పలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.