Healthhealth tips in telugu

Tongue Colour:నాలుక మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్పుతుందో తెలుసా ?

Tongue Colour:మనం సాదారణంగా డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు రొటీన్ చెకప్ లో బాగంగా నాలుకను చూస్తారు. మన నాలుక మొత్తం మన ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది. నాలుకను చూసి అనేక రకాల వ్యాధులను ప్రాధమికంగా గుర్తించవచ్చు.

నోటిలో చిగుళ్ళ తరువాత నాలుక మీదే ఎక్కువగా వ్యాధి కారకాలు నివసిస్తాయి. అయినప్పటికీ నాలుక అనేది మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసే అవయవాలలో ఒకటిగా ఉంది. నాలుక ఒక అంతర్గత అవయవం అయిన సరే, బాహ్య అవయవాలను ఏ విధంగా అద్దంలో చూసుకుంటామో అలాగే నాలుకను కూడా చూస్తూనే ఉంటాం.

నాలుక బహిర్గతం చేసే విషయాలను చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అనేక వ్యాధులను గుర్తించటంలో నాలుక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల మనం నాలుకను ఆరోగ్యకరముగా నిర్వహించవలసిన బాధ్యత ఉంది.ఇక్కడ నాలుక మీద లక్షణాల బట్టి వివిధ ఆరోగ్య సమస్యలను ఎలా గుర్తించవచ్చో చూద్దాం.

1. ముదురు ఎరుపు రంగు
సాదారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక గులాబి రంగులో ఉంటుంది. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే, అది రక్తహీనత, కవాసాకి వ్యాధి మరియు స్కార్లెట్ జ్వరం వంటి వాటికి సంకేతంగా భావించాలి. నాలుక ముదురు ఎరుపు రంగులో ఉంటే విటమిన్ బి 12 లోపం ఉందని గుర్తించాలి. శరీరంలో ఎర్ర రక్తకణాలను తయారుచేయటానికి విటమిన్ B12 అవసరం. ఇది లోపిస్తే అలసట మరియు రక్తహీనత కలుగుతాయి.

2. తెలుపు పాచెస్
సాదారణంగా నాలుక మీద తెల్లటి రంగులో, కాటేజ్ చీజ్ లాంటి పూత పాచెస్ గా ఏర్పడుతుంది. ఇది నోటి కాన్డిడియాసిస్ వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది నోటిలో ఈస్ట్ సంక్రమణ ద్వారా కలుగుతుంది. ఇది సాదారణంగా ముసలి వారు,పసి పిల్లల్లో రోగనిరోదక శక్తి తగ్గటం వలన ఏర్పడుతుంది.

3. అసాదారణ మృదుత్వం
నాలుక ఉపరితలం మీద చిన్న వెంట్రకల వంటి నిర్మాణాలు ఉండుట వలన నాలుక కరుకుగా ఉంటుంది. ఈ విధంగా మృదుత్వం కోల్పోయి కరుకుగా ఉన్న నాలుక అసాధారణంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉన్న నాలుకను కృశించిన నాలుక అంటారు. ఈ స్థితిలో నాలుక మంట మరియు నొప్పి ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి పోషక లోపంనకు సంబంధం ఉంది.

4. మందపాటి, పసుపు పూత
నాలుక మీద పసుపు పూత రావటానికి వేడి చేయటం మరియు బాక్టీరియా కారణం కావచ్చు. సంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం, ఒక ఎర్రబడిన నాలుక మీద ఒక పసుపు పూత అనేది శరీరంలో చాలా వేడి ఉందని అర్ధం.

5. నొప్పి లేని పొక్కులు
నాలుక మీద నొప్పి లేని పొక్కులు రెండు వారాల కన్నా ఎక్కువ రోజులు ఉంటే కనుక అది నోటి క్యాన్సర్ ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ చిన్న పొక్కులు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే అవకాశం ఉంది. అలాగే మీరు తీసుకున్న ఆహారం మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది.

6. పుళ్ళు
చిన్నగా మరియు చాలా బాధాకరముగా ఉండే నాలుక లేదా నోటి పుళ్ళను అల్సర్ అని పిలుస్తారు. సాధారణంగా ఇవి బుగ్గల లోపలి ఉపరితలంపై లేదా నాలుక కింది బాగంలో ఏర్పడతాయి. సాదారణంగా పదునైన వస్తువులు తగిలినప్పుడు లేదా అనుకోకుండా కోరికినప్పుడు పుళ్ళుగా మారతాయి. ఈ అల్సర్స్ రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉంటే ఒత్తిడి, ఆందోళన లేదా హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు.

7. పగుళ్ళు
పగుళ్ళు అనేవి నాలుక ఉపరితలం పై ఏర్పడతాయి. ఇవి మండే అనుభూతి ఉన్నా నొప్పి మాత్రం ఉండవు. ఇది ఎక్కువగా వయస్సు ఉన్న వారిలో కనిపించే సాదారణ పరిస్థితి. అయితే ఈ పరిస్థితి వృద్ధాప్యంలో తీవ్రంగా ఉండవచ్చు. నాలుక పగుళ్ళు అనేవి దాగి ఉన్న వ్యాధులకు సూచన కావచ్చు. నాలుక పగుళ్ళు అనేవి సోరియాసిస్ రోగులకు 6 నుండి 20 శాతం సాధారణ లక్షణంగా ఉన్నది.

8. మండే అనుభూతి
నోటిలో ఎల్లప్పుడూ మంట అనుభూతి ఉంటే, ప్రత్యేకంగా నాలుక మీద మండే అనుభూతి ఉంటే “బర్నింగ్ నోటి సిండ్రోమ్” తో బాధ పడుతున్నారని వైద్య పరిశోదకులు అంటున్నారు. నోరు పొడిగా ఉండటం,రుచిలో మార్పు,తిమ్మిరి వంటి లక్షణాలు సాదారణంగా ఉంటాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే నోటిలో మండే అనుభూతి ఉందని అర్ధం చేసుకోవాలి.

9. నలుపు మరియు వెంట్రుకలు
నాలుక మీద నలుపు మరియు వెంట్రుకల పరిస్థితి ఆందోళనకరమైనదని చెప్పవచ్చు. అయితే ఈ పరిస్థితికి పరిశుభ్రత మరియు జీవనశైలి పరిస్థితులు, ఆహార అలవాట్లు, ఎక్కువగా ధూమపానము మరియు నోటి పరిశుభ్రత లేకపోవటం వంటి కారణాలు అని చెప్పవచ్చు.

10. ఊదా రంగు
ఊదా రంగు నాలుక అంటే ద్రాక్ష పళ్ళను బాగా చప్పరించినప్పుడు వచ్చే ఊదా రంగు నాలుక కాదు. వైద్యపరంగా ఈ ఊదా రంగు నాలుక ఎన్నో ఆరోగ్య విషయాలను బహిర్గతం చేస్తుంది. నాలుకకు రక్త ప్రసరణ సరిగ్గా లేదని సూచనగా అర్ధం చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.