Kitchenvantalu

Gongura Rice Recipe:కేవలం 5 నిమిషాల్లో కమ్మనైన గోంగూర రైస్ మీలంచ్ బాక్స్ లోకి..

Gongura Rice:గోంగుర రైస్.. నిమ్మకాయతో పులిహోరా చేస్తునే ఉంటాం. పుల్లపుల్లని గోంగుర తో రైస్ చేసి చూడండి కాస్త డిఫరెంట్ గా టేస్టీ గా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 2 స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
కరివేపాకు – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 7-8
ధనియాల పొడి – ½ టీ స్పూన్
నువ్వుల పొడి – ½ టీస్పూన్

తయారీ విధానం
1.పుల్లటి గోంగుర ఆకులను ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టుకోని చల్లారాక పేస్ట్ చేసుకోవాలి.
2.స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనే వేడి చేసి అందులోకి పల్లీలు,వేసి వేగాక ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కరివేపాకు,పసుపు వేసి వేపుకోవాలి.
3.వేగిన తాలింపులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగుర పేస్ట్ ని వేసి కలుపుకోవాలి.
4.ఇప్పుడు 1 ½ కప్పు వండిన అన్నం లోకి రెండు టేబుల్ స్పూన్స్ గోంగుర పేస్ట్ వేసి కలుపుకోవాలి.
5.అందులోకి కొత్తిమీర,నువ్వుల పొడి,సరిపడా ఉప్పు వేసి కలుపుకోవని సర్వ్ చేసుకోవడమే.