Kitchenvantalu

Munagaku Pappu Recipe:ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పప్పు.. చాలా సింపుల్..

Munagaku Pappu Recipe:మునగాకు పప్పు.. కూరల్లో అత్యంత ఆరోగ్యకరమైనా మునగ రెసిపీలు వారంలో ఒక సారైనా తినాలి. మునక్కాడలు సాంబార్లో వేసుకుంటే.మునగాకు తో పప్పు చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
మునగాకులు – 2 కప్పులు
కంది పప్పు – 1 కప్పు
టమోటో – 1
పచ్చిమిర్చి – 5
చింతపండు – 30 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 5-6
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
ఎండు మిర్చి – 2
కరివేపాకు – 1 కప్పు
ఆవాలు – ½ టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ప్రెషర్ కుక్కర్ లో పప్పు ,మునగాకు ,పచ్చిమిర్చి,టమాటో ,చింతపండు,పసుపు,మూడు కప్పుల నీళ్లను వేసి మూతపెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.ప్రెషర్ పోయిన తర్వాత ఉప్పు యాడ్ చేసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి.
3.ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లి రెబ్బను బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
4.ప్యాన్ లో నూనే వేడి చేసి అందులోకి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి తాలింపును వేపుకోవాలి.
5.వేగిన తాలింపులో రుబ్బుకున్న పప్పును యాడ్ చేసి సరిపడా నీళ్లను కలుపుకోవాలి.
6.లో ఫ్లేమ్ పై ఐదారు నిమిషాలు ఉడకించుకుంటే మునగాకు పప్పు రెడీ.