Kitchen

Bed Bugs: నల్లులు నరకం చూపిస్తున్నాయా? ఇలా చేస్తే వాటిని నాశనం చేయొచ్చు..

Home Remedies For Bed bugs:బెడ్ బగ్స్ అనేవి మన ఇంటిలో వస్తువులు, బట్టలు, ఫర్నీచర్ ద్వారా చాలా సులభంగా వ్యాపిస్తాయి. వీటి కారణంగా అలర్జీ, చర్మంపై దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తొలగించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అయితే కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

లవంగాలు బగ్స్ ని తరిమి కొట్టటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఒక స్ప్రే బాటిల్ లో ఒక స్పూన్ లవంగాల పొడి, గోరువెచ్చని నీటిని పోసి బాగా కలిపి బగ్స్ ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. అలా చేస్తూ ఉంటె క్రమంగా బగ్స్ బారి నుండి బయట పడవచ్చు.

టీ ట్రీ ఆయిల్ కూడా బగ్స్ నివారణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నీటిలో టీ ట్రీ ఆయిల్ ని కలిపి బగ్స్ ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే సరిపోతుంది.

పుదీనా ఆకులు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తాజా పుదీనా ఆకులను మంచం, దిండు కింద ఉంచితే బెడ్ బగ్స్ బెడద తగ్గుతుంది.

నీటిలో బేకింగ్ సోడా కలిపి బగ్స్ ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే బగ్స్ ఉదృతి తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలు అన్నీ చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని ఫాలో అయ్యి బెడ్ బగ్స్ ని తరిమి కొట్టి ప్రశాంతంగా నిద్రపోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.