Kitchenvantalu

Carrot Rice Recipe:లంచ్ బాక్స్ లోకి…5నిమిషాల్లో టేస్టీగా రెడీ…పిల్లలు ఇష్టంగా తింటారు

Carrot Rice: మిగిలిపోయిన అన్నంలోకి, ఎంత టేస్టీ కర్రీస్ వేసుకున్నా, టేస్టీగా అనిపించదు, తినబుద్ది కూడా అవ్వదు. అలా మిగిలిపోయిన రైస్ కి, క్యారెట్ యాడ్ చేసుకుని, రెసిపీ చేసుకుంటే,యమ్మీ యమ్మీగా లాగించేయవచ్చు.

కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం – 1 కప్పు
తురిమిన క్యారెట్ – 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము – ½ కప్పు
పచ్చిమిర్చి -2
జీడిపప్పులు – 15
దాల్చిన చెక్క – 1 ఇంచ్
యాలకులు – 4
లవంగాలు -4
బిర్యానీ ఆకు -1
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తమీర – కొద్దిగా
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
సాంబార్ పొడి -1 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 3 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత, యాలకులు, లవంగాలు, జీడిపప్పులు, బిర్యాని ఆకు వేసుకుని, మంచి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మగ్గే వరకు వేయించాలి.
3. ఉల్లిపాయలు మగ్గాక , క్యారేట్ తురుము యాడ్ చేసి, మరో మూడు నిముషాలు వేయించాలి.

4.ఉప్పు సాంబార్ పొడిని జోడించి, పచ్చి కొబ్బరి యాడ్ చేసి, బాగా కలుపుకోవాలి.
5. బాగా వేగిన ఈ మిశ్రమంలోకి ఉడికించిన అన్నం వేసుకుని, కలిసేలా, మిక్స్ చేసుకోవాలి,
6. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, నిమ్మకాయ రసాన్ని, కొత్తిమీర చల్లుకుంటే,
క్యారేట్ రైస్ రెడీ.

Click Here To Follow Chaipakodi On Google News