Kitchenvantalu

Mixed Veg Lollipop:రెస్టారెంట్ల‌లో ల‌భించే వెజ్ లాలిపాప్స్‌ను ఇంట్లోనే..పిల్లలు ఇష్టపడే ఈజీ స్నాక్

Mixed Veg Lollipop Recipe: రెస్టారెంట్స్ స్టైల్లో, ఇంట్లోనే హెల్తీగా ,పిల్లలు నచ్చేలా, వెజ్ లాలీ పాప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బర్త్ డేస్ కు చిన్న చిన్న కిడ్స్ గ్యాదెరింగ్స్ కి, ఇవి కాని తయారు చేసి సెర్వ్ చేసారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు.

కావాల్సిన పదార్దాలు
ఉడికించిన బంగాళ దుంపలు – ¾ cup
తురిమిన క్యారేట్ – ½ కప్పు
తురిమిన క్యాబేజ్ – ½ కప్పు
తరిగిన ఫ్రెంచ్ బీన్స్ -½ కప్పు
పచ్చిమిర్చి – టేబులు స్పూన్
ఉల్లిపాయలు – ¼ కప్పు
నిమ్మరసం – 1 స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ½ టేబుల్ స్పూన్
జీలకర్రపొడి– ½ టేబుల్ స్పూన్
గరం మసాలా – ½ టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
కారం– ½ టేబుల్ స్పూన్
తరిగిన కొత్తిమీర -2 టేబుల్ స్పూన్స్
ఐస్ క్రీమ్ స్టిక్స్
నూనె
మైదా – ¼ కప్పు
బ్రెడ్ ముక్కలు – ½ కప్పు

తయరీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని, జీలకర్ర వేసి వేయించాలి.
2. అందులోకి తురిమిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, వేసుకునిపచ్చి వాసన పోయేలా సన్నటి మంటపై ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు తరిగిన క్యాబేజ్,క్యారేట్, బీన్స్, వేసుకుని, 3 నిముషాల పాటు వేయించాలి.
4. కాస్త నీరు ఇగిరిపోయాక, ఉప్పు, కారం , జీలకర్ర పొడి,చిల్లీ ఫ్లేక్స్ , గరం మసాలా, యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి.
5. 1 నిముషం తర్వాత మెత్తగా ఉడికించిన బంగాళ దుంపలను వేసుకుని ,బాగా కలపి స్టవ్ ఆఫ్ చేయండి

6. చల్లారిన ఈ మిశ్రమాన్ని, చిన్న బాల్స్ రూపంలో తయారు చేసుకుని, అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.
7. ఇప్పుడు మైదాలో కొద్దిగా ఉప్పు వేసి పల్చని మిశ్రమం లా కలుపుకోండి.
8. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెజ్ బాల్స్ ను, మైదా పిండిలో ముంచి, బ్రెడ్ తురుములో కోట్ చేసుకుని, దానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ ను అతికించాలి.
9. స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, తయారు చేసుకున్న లాలీ పప్స్ ను మీడియం ఫ్లేమ్ పై గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
10. అంతే .. వేడి వేడి వెజ్ లాలీ పాప్స్ .. టమాటా సాస్ తో తింటే అదిరిపోతుంది.