Healthhealth tips in telugu

Cold And Cough:జలుబును నిమిషంలో తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

Cold And Cough Home remedies:జలుబు అనేది తరచూ వినిపించే మాట. వాతావరణంలో ఉండే వందలాది వైరస్ ల వలన జలుబు వస్తుంది. వైరస్ ఉంది కాబట్టి తప్పనిసరిగా యాంటిబయాటిక్స్ వాడాల్సిందే అని చాల మంది భావిస్తారు. యాంటిబయాటిక్స్ వాడకుండానే జలుబును తగ్గించుకోవచ్చు. అదీ ఇంట్లో ఉండే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు.

ఉప్పు నీరు
జలుబు ప్రారంభం కావటానికి ముందే కొన్ని సూచనలు కనిపిస్తాయి. గొంతులో కొద్దిగా మంట,గరగర వంటి సూచనలు కనిపించగానే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని నాలుగైదు సార్లు పుక్కిలించి ఉమ్మాలి. రెండు మూడు రోజుల పాటు ఈ విధంగా చేస్తే జలుబు నుంచే కాకుండా గొంతు అసౌకర్యం నుంచి కూడా తప్పించుకోవచ్చు.

విటమిన్ సి
వాతావరణంలో మార్పులు కనిపించగానే విటమిన్ సి మాత్రలు వాడటం మంచిది. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి జలుబును దూరం చేస్తాయి.

నిమ్మరసం
నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిమ్మరసం త్రాగితే జలుబు చేస్తుందనే విషయంలో ఎటువంటి వాస్తవం లేదు. ఆహార పదార్దలలోను,సలాడ్స్ లలోను నిమ్మరసం వేసుకోవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం పిండుకొని త్రాగవచ్చు.

ఆవిరి
జలుబు చేసినప్పుడు ఉప్పు నీటి ఆవిరి పెట్టటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పద్దతి. ఆవిరి పట్టే నీటిలో కొంచెం పసుపు కలిపితే మరింత మంచి పలితాన్ని పొందవచ్చు. పసుపు యాంటిబయాటిక్ గా పనిచేసి జలుబు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను నాశనం చేస్తుంది. ఇదే నీటిలో పసుపుకు బదులు యూకలిప్టస్ ఆయిల్ వేసిన మంచి పలితాన్ని పొందవచ్చు.

పసుపు
వేడిపాలలో చిటికెడు పసుపు వేసుకొని త్రాగిన జలుబు తొందరగా తగ్గుతుంది. రాత్రి పడుకొనే సమయంలో త్రాగితే రాత్రి సమయంలో జలుబు అంతగా భాదించదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.