Healthhealth tips in telugu

Calcium Rich Foods:దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ..ఈ ఆహారాలు తప్పనిసరి

Calcium Rich Foods:సాదారణంగా దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే మన శరీరంలో తగినంత కాల్షియం ఉండాలి. మనలో కాల్షియం తగ్గే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్ర్తీలకే అధిక కాల్షియం అవసరం. మహిళల్లో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయి. దీనికి కారణం కాల్షియం తక్కువగా ఉండటమే.

వయస్సు పెరుగుతున్నా ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి. శరీరానికి కాల్షియం పుష్కలంగా అందాలంటే సి విటమిన్‌, కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటే మంచిది.

గోధుమలు, పాలిష్‌ చేయని బియ్యం, పీచుపదార్థాలు తింటే మన శరీరానికి పూర్తిస్థాయిలో కాల్షియం అందుతుంది.అయితే కాల్షియం సప్లిమెంట్లను వేడి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. నిద్రపోయే ముందు, తరువాత గానీ వీటిని తీసుకోవాలి. మీ శరీర తత్వానికి తగ్గుట్టుగా ఎంత mg ఉన్న మాత్రలు వేసుకోవాలో డాక్టరును ఖచ్చితంగా సంప్రదించాలి.

ఏవైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే కాబట్టి వీటిని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. మనం ఒక రోజులో తీసుకున్న పాలు, పెరుగు వలన సుమారు 300 ఎంజి కాల్షియాన్ని మన శరీరానికి అందించగలవు. నిమ్మజాతి పండ్లను తీసుకున్నా శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.