Kitchenvantalu

Baby Corn Masala Curry Recipe:రైస్, రోటి, చపాతీ, నాన్ ఇలా దేనిలోకైనా అదిరిపోయే బేబీ కార్న్ మసాలా కర్రీ

Baby Corn Masala Curry:బేబి కార్న్ మసాలా కర్రీ..చేసిన వంటలే చేస్తే తినేవారికి,చేసే వారికి కూడ బోర్ గా అనిపిస్తుంది.అప్పుడప్పుడు స్పెషల్ గా కొత్తగా ట్రై చేస్తుండాలి.వీకెండ్ స్పెషల్ గా బేబి కార్న్ మసాలా కర్రీ చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బేబి కార్న్ – 250 గ్రాములు
ఉల్లిపాయలు – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
టమాటో పేస్ట్ – ½ కప్పు
ఉల్లిపాయ పేస్ట్ – ½ కప్పు
అల్లం వెల్లుల్లిపేస్ట్ – 1 టీ స్పూన్
కారం – 2 టీ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
నూనె 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా బేబి కార్న్ కావల్సిన సైజ్ లోకి ముక్కలుగా కట్ చేసి ఉడికించి పెట్టుకోవాలి.
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగువేసి ఫ్రై చేసుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక,ఉల్లిపాయ పేస్ట్,టోమాటో పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తు ఫ్రై చేసుకోవాలి.
4.తరిగిన పచ్చిమిర్చి ,ఉడికించిన బేబి కార్న్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.

5.కార్న్ మగ్గాక కారం,ధనియాల పొడి,జీలకర్ర పొడి,ఉప్పు,పసుపు వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.
6.రెండు కప్పుల నీళ్లు పోసి గ్రేవి చిక్క పడే వరకు ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు గరం మసాలా,కొత్తిమీర తరుగు వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే బేబి కార్న్ మసాలా కర్రీ రెడీ.