Kitchenvantalu

Kitchen Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే వంటింటి చిట్కాలు

Kitchen Hacks in telugu:పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులను తింటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే డయాబెటిస్,అధిక బరువు సమస్యతో బాధపడేవారికి మంచి ఔషదంగా చెప్పవచ్చు.

పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులు టమోటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.

తలనొప్పి తగ్గటానికి ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ మంచి నీటిలో కొద్దిగా ధనియాల పొడి,కొంచెం పంచదార వేసి బాగా కలిపి ప్రతి రోజు త్రాగుతూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.

కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అంతేకాకుండా తాజాగా ఉంటుంది.

కూరల్లో కారానికి బదులు పచ్చిమిరపను వాడితే శరీరంలో కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఈ చిట్కాలను కాస్త ఓపికగా పాటిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.