Healthhealth tips in telugu

Chest Pain: ఛాతిలో మంట….. నో ప్రోబ్లం…Best Tips

Chest Pain: మధ్యాహ్నం లేదా రాత్రి వేళ పూర్తి స్థాయిలో భోజనం చేసి బ్రేవ్ మని త్రేన్చిన అరగంట తర్వాత మొదలవుతుంది ఈ సమస్య. పొట్ట పై భాగం నుండి ప్రారంభమై సన్నని మంట లాంటి నొప్పి నెమ్మదిగా తీవ్ర మవుతూ ఛాతి వరకు పాకుతుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన నొప్పి కూడా వస్తుంది. ఏ పని చేయబుద్దికాదు.

దీని వలన మనం ఎంతో ఇష్టంగా తీసుకున్న భోజనం కూడా వాంతి వచ్చేస్తుందేమో అని అన్పిస్తుంది. ఇన్ని సూచనలు చూసిన తర్వాత ఛాతిలో మంటను గుండె నొప్పిగా భావించి కంగారు పడతాము. కానీ ఇది కేవలం ఏసిడిటి వలన వచ్చే సమస్య. అందువలన దీని కోసం కంగారుపడి డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ఛాతి మంటను తగ్గించుకోవచ్చు.

మొదట ఈ చిట్కాలను ఉపయోగించండి. అప్పటికి తగ్గకపోతే అప్పుడు మీరు డాక్టర్ ని సంప్రదించండి.బాదంపప్పు గుండె మంటను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంటిలో ఉండే నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని ఉప్పుతో కలిపి తీసుకోవాలి. ఈ రెండు పద్దతులు గుండె మంటను తగ్గించటానికి చాలా దోహదం చేస్తాయి.

కొన్ని పుదినా ఆకులను కప్పు నీటిలో నానబెట్టి భోజనం అనంతరం ఆ నీటిని తీసుకోవాలి. ఆ విధంగా కొన్ని రోజులు తీసుకుంటే గుండెలో మంట తగ్గే అవకాశం ఉన్నది.

భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గలో పెట్టుకొని ఆ రసాన్ని మ్రింగాలి. కడుపులో ఎసిడిటి తగ్గటానికి సహాయపడుతుంది. రెండు స్పూన్స్ ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు స్పూన్స్ నీటిలో కలిపి భోజనంనకు ముందు తీసుకోవాలి. సాదారణంగా తులసి చెట్టు ఉండని ఇల్లు ఉండదు.

భోజనం అనంతరం కొన్ని తులసి ఆకులను నమిలి మ్రింగాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేయుట వలన ఎసిడిటి మరియు గుండెలో మంట తగ్గుతాయి. ఒక కప్పు నీటిలోసోంపు గింజలు వేసి ఉడికించి రాత్రి పూట అలా ఉంచి ఉదయమే వడకట్టి ఆ నీటిలో తేనే కలిపి పరగడుపున త్రాగాలి. గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి ఉదయం పరగడుపున తీసుకుంటే అనుకున్న పలితం కనపడుతుంది.

మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అయిన వెంటనే ఐదు లేదా పది నిముషాల పాటు నడవటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటి తగ్గుతుంది.

ఆహారంలో పైబర్ ఎక్కువగా తీసుకోవటం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది. తద్వారా గుండె మంట,ఎసిడిటి తగ్గుతుంది. ఎసిడిటి తో బాధపడేవారు ఒకే సారి పెద్ద భోజనం కాకుండా నాలుగు, ఐదు సార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి. పొట్టను ఖాళీగా ఉంచకూడదు. అలాగే వేపుడు కూరలు,మసాలా పదార్దాలకు దూరంగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.