Kitchenvantalu

Gas Saving Tips: ఈ టిప్స్ ఫాలో అయితే 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

Tips To Save Cooking Gas in telugu:మనం ప్రతిరోజు కచ్చితంగా గ్యాస్ వాడాల్సిందే. ఒకప్పుడు వంట చేయటానికి గ్యాస్ ని చాలా తక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏ పని అవ్వటం లేదు. రోజురోజుకి గ్యాస్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అందుకే వంట గ్యాస్ ను ఆదా చేసుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. వంట గ్యాస్ ని ఆదా చేసుకుంటే ఇంటి బడ్జెట్ తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

వంట చేస్తున్నప్పుడు మనం సాధారణంగా చాలా హడావిడిగా ఉంటూ ఉంటాం. అలా హడావుడిగా ఉన్నప్పుడు తడిగా ఉన్న పాత్రలను పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం. అప్పుడు తడిగా ఉన్న పాత్రలో ఉన్న తడి ఆవిరి అయ్యేవరకు వేడి చేయడం వలన గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది. అలా కాకుండా తడి పాత్రను పొయ్యి మీద పెట్టడానికి ముందు ఒక శుభ్రమైన క్లాత్ తో తుడిచి పొయ్యి మీద పడితే గ్యాస్ ఆదా అవుతుంది.

ప్రెజర్ కుక్కర్ వాడితే గ్యాస్ అదా అవుతుంది. అలాగే వండే ముందు బియ్యం, పప్పులు వంటి వాటిని కనీసం రెండు గంటల పాటు నానబెడితే తొందరగా ఉడకటమే కాకుండా గ్యాస్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.

ఆహారాన్ని వండేటప్పుడు మూత వేసి వండితే ఆరోగ్యానికి మంచిది…అలాగే పోషకాలు అన్నీ కూడా అలానే ఉంటాయి.అంతేకాకుండా మూత పెట్టి వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట పూర్తి చేయటానికి కొంచెం ముందుగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలి. గిన్నె మీద మూత మాత్రం అలానే ఉంచాలి. అప్పుడు లోపల ఉన్న వేడికి మిగతా వంట పూర్తవుతుంది.

అన్నం, కూరలు వండే సమయంలో సరిపడా నీళ్లు మాత్రమే పోయాలి. అలా చేయటం వల్ల వంట సమయం తగ్గుతుంది ఆ విధంగా గ్యాస్ వృధా కాదు. బర్నర్ కి సరిపోయేంత పెద్ద పాత్రలనే వాడాలి. చిన్న పాత్రలు వాడితే మంట పక్కకు వెళ్లి గ్యాస్ వృధా అవుతుంది. చిన్న మంట మీద వంటలు చేస్తే గ్యాస్ ఆదా అవటమే కాకుండా పోషకాలు కూడా అలాగే ఉంటాయి. గ్యాస్ పైప్ ఏమైనా లీక్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి.

బర్నర్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఫ్రిజ్ లో నుండి తీసిన పాలు, కూరగాయలు వంటి వాటిని ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే పొయ్యి మీద పెట్టకూడదు. కనీసం రెండు గంటలు బయట ఉంచి ఆ తర్వాత ఉడికించాలి. అప్పుడు గ్యాస్ అదా అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.