Kitchenvantalu

Remove chewing Gum from clothes: బట్టలకు అంటిన చూయింగ్ గమ్ తొలగించటానికి….సింపుల్ చిట్కా

Chewing gum remove Tips :మీ బట్టలకు ఎప్పుడైనా నమిలి పడేసిన చూయింగ్ గమ్ అంటుకుందా? దానిని తొలగించడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఒక సింపుల్ చిట్కా ద్వారా బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్ ను తొలగించవచ్చు.

మొదటగా చూయింగ్ గమ్ అంటిన ప్రదేశాన్ని … హెయిర్ డ్రయ్యర్ సాయంతో వేడి చేయాలి. ఇలా వేడి కాగానే…చూయింగ్ గమ్ కాస్త లిక్విడ్ స్టేజ్ లోకి వస్తుంది. ఆ సమయంలో ఓ ప్లాస్టిక్ కత్తి( బర్త్ డే లకు కేక్ కట్ చేసే నైఫ్) తో వచ్చినంత వరకు చూయింగ్ ను తొలగించాలి.

ఆ తర్వాత మిగిలిన చూయింగమ్ పై BENGOY (పెయిన్ రిలీవింగ్ జెల్) ను వేసి….ఆ ప్రాంతాన్ని బాగా రుద్దాలి. ఆ తర్వాత చేతికి ఓ ఫ్లాస్టిక్ కవర్ ను తొడిగి….ఆ ప్రదేశం మొత్తం శుభ్రం చేయాలి….చూయింగ్ గమ్ అంటిన మరక కూడా లేకుండా ఆ ప్రాంతమంతా….శుభ్రం అయిపోతుంది.

ఇంకో పద్దతిలో …ఒక ఐస్ ముక్కకు తీసుకొని చూయింగ్ గమ్ మీద అలాగే రుద్దుతూ పోతే..అది గడ్డ కడుతుంది. అప్పుడు చూయింగ్ గమ్ ను సింపుల్ గా తీసోయొచ్చు..అయితే కాస్ట్లీ కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం పై చిట్కానే బాగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.