Kitchenvantalu

Cooking Tips:కుక్కర్‌లో ఏదైనా ఉడికించినప్పుడు నీరు లీక్ అవుతుందా..ఇలా చేస్తే సరి…!

How To Stop Pressure Cooker Water Leakage:సాధారణంగా ప్రతిరోజు మనం ప్రెషర్ కుక్కర్‌ లో వంట చేస్తూ ఉంటాం. ఒక్కోసారి పప్పులు ఉడికించి నప్పుడు,అన్నం వండినప్పుడు నీరు అంతా బయటకు వచ్చి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించాలి.

వంట చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ ను బాగా కడగాలి. స్టీమ్ వాల్వ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. కుక్కర్లో వంట చేసినప్పుడు నాలుగు వంతులలో ఒక వంతు స్థలం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన నీరు లీక్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ వాషర్ సరిగ్గా అటాచ్ చేయకపోయినా లేదా వదులుగా ఉన్నా… ఉడికించినప్పుడు నీరు లోపలి నుంచి బయటికి వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రెషర్ కుక్కర్లో వంట చేసినప్పుడు నీరు బయటకు రాకుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.