Beauty Tips

Olive Oil For Face:ఆలివ్ ఆయిల్ ఎంత మాయ చేస్తుందో తెలిస్తే అవ్వాలసిందే

Olive Oil For Face:ప్రస్తుతం చాలా మంది నోట వినిపిస్తున్న పదం ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ పురాతన కాలం నుండి ఉన్నదే! కాకపోతే దీని వాడకం వల్ల కలిగే లాభాలు ఇటివల కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఆరోగ్యం మీద,అందం మీద శ్రద్ద,ఆసక్తి రెట్టింపు కావటంతో దీని వాడకం కూడా అధికం అయింది. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకుందాము.

గుండె జబ్బులు
ఇటలీ,గ్రీస్,స్పెయిన్ వంటి దేశాలలో ఇప్పటికి దీనిని వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువలన అక్కడ గుండె జబ్బులు తద్వారా సంభవించే మరణాల రేటు తక్కువగా ఉంటుంది. దీన్ని వంటలలో ఉపయోగించటం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.

కడుపు ఉబ్బరం
ఆలివ్ ఆయిల్ ను వంటలలో ఉపయోగించుట వలన కడుపు ఉబ్బరం వంటి గ్యాస్ సంబదింత వ్యాదులు తగ్గుతాయి.

రక్తపోటు
ఆలివ్ ఆయిల్ ను వంట పదార్దాల తయారీలో ఉపయోగించుట వలన రక్తపోటు అదుపులో ఉంటుందని కొన్ని పరిశోదనలలో తెలిసింది.

సర్వరోగనివారిణి
విషానికి విరుగుడుగా,ఉత్సాహాన్ని ఇచ్చే శక్తిగా పనిచేస్తుంది. చిన్న ప్రేగులలోని పురుగులను బయటకు పంపించి వేస్తుంది. గాయాలు,కాలిన బొబ్బలకు మందుగా పనిచేస్తుంది. ఆలివ్ పండ్లను తినటం ద్వారా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

సౌందర్య సాధనం
ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్య లాభాలే కాకుండా సౌందర్య లాభాలు కూడా దాగి ఉన్నాయి. చేతులు,జుట్టు మర్దనకు బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది. ముడతలను నివారించే శక్తి ఉంది. వయస్సు ప్రభావాన్ని అరికడుతుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. అలాగే చుండ్రు ను నివారిస్తుంది.