Kitchenvantalu

Carrot Bobbatlu: క్యారెట్ తో చేసే బొబ్బట్టు, టేస్టీగా, మృదువుగా.. సులువైనా విధానం.. రుచి ఆరోగ్యం కూడా..

Carrot Bobbatlu: పండగలప్పుడే కాకుండ అప్పుడప్పుడు కొన్ని స్వీట్స్ తినడానికి సందర్బం అస్సలు అవసరం లేదనిపిస్తుంది.ఈజీగా తయారు చేసుకోవాలనిపిస్తే క్యారట్ తురుముతో ఇలా తయారు చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
క్యారెట్ తురుము – 1 కప్పు
గోధుమ పిండి – 1 కప్పు
తురిమిన బెల్లం – ½ కప్పు
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి -1/2 టీ స్పూన్
ఉప్పు – కొద్దిగా

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి గోధుమ పిండి చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి.
2.తగినన్ని నీళ్లు కలుపుతూ మొత్తని పిండి ముద్దలా కలిపి,రెండు మూడు స్పూన్స్ ఆయిల్ వేసి మెత్తగా కలుపుకోని అరగంట పాటు పక్క పెట్టుకోవాలి.
3.ఇప్పుడు స్టఫింగ్ కోసం ప్యాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి తురిమిన క్యారెట్ వేసి వేపుకోవాలి.
5. అందులోకి బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్ పై మిశ్రమం గట్టి పడే వరకు కలుపుతు వేపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి.

7.యాలకుల పొడిని కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.కలుపుకున్న పిండి ముద్దను చిన్న బాల్స్ లా చేసుకోని పూరిలా తాల్చుకోవాలి.
9.అలాగే క్యారెట్ స్టఫ్ ని కూడ బాల్స్ లా తయారు చేసి పూరిలో ప్లేస్ చేసుకోని పిండితో మూసివేయాలి.
10.ఎక్స్ట్రా పిండిని తీసివేసి ప్లాస్టిక్ కవర్ పై నూనె రాసుకోని పల్చగా స్టఫ్ బయటికి రాకుండా వత్తుకోవాలి.
11.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేసుకోని వేడిక్కిన పెనం పై తయారు చేసుకున్న బొబ్బట్టును వేయాలి.
12.మీడియం ఫ్లేమ్ పై రెండు వైపులా దోరగా కల్చుకోని సర్వ్ చేసుకోవడమే.