Beauty Tips

Face Glow Tips:బెండకాయతో ఇలా చేస్తే మొటిమలు ,నల్లని మచ్చలు, ముడతలకు చెక్ పెట్టవచ్చు

Bendakaya Face Glow Tips : బెండకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. బెండకాయ ముఖాన్ని కాంతివంతంగా మార్చటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. బెండకాయలో విటమిన్ ఎ, సి, ఫోలేట్ మరియు కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.

ఇవి మన చర్మ కణాలపై పనిచేసి వాటిని ఆరోగ్యవంతంగా చేయటమే కాకుండా చర్మానికి మెరుపును ఇస్తాయి. బెండకాయను మెత్తని పేస్ట్ గా చేసి దానికి అర టీస్పూన్ టీ ట్రీ ఆయిల్, 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Wrinkles remove Tips In Telugu
వారంలో రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం మీద మచ్చలు,ముడతలు లేకుండా కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బెండకాయ సహజ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే చర్మంలో అదనంగా ఉన్న జిడ్డును తొలగిస్తుంది. మొటిమలకు కారణం అయినా సూక్ష్మక్రిములను తొలగిస్తుంది.
Pimples,Beauty
మొటిమల సమస్యకు బెండకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. బెండకాయలో ఉండే జెల్ లాంటి ద్రవం మొటిమలను తొలగించటానికి సహాయ పడుతుంది. బెండకాయలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు రీ-హైడ్రేటింగ్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.దాంతో చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Bendakaya Benefits In telugu
బెండకాయలో ఉండే కెరోటినాయిడ్స్ దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మత్తును చేస్తాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను తగ్గిస్తుంది. బెండకాయ సంవత్సరం పొడవునా లభిస్తుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో ముఖం మీద ముడతలు,మొటిమలు,నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.