Beauty Tips

White Hair Turn Black:చిన్న వయస్సులో తెల్లజుట్టు వచ్చిందా…ఇలా చేస్తే నల్లగా మారటం ఖాయం

White Hair Turn Black:జుట్టుకి సంబందించిన సమస్యలు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. అలా చిన్న వయస్సులోనే రావటంతో మానసికంగా క్రుంగిపోతున్నారు. అలాగే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటున్నారు.

దాంతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా కాకుండా కాస్త ఓపికతో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. జామ ఆకుల రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు కుదుళ్ళను బలంగా చేసి జుట్టు రాలకుండా చేయటమే కాకుండా చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.