Healthhealth tips in telugu

Gas Problem:గ్యాస్,ఎసిడిటి,కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట మాయం

Cumin Seeds Gas Problem Home Remedies In Telugu : గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండలేము. గ్యాస్ సమస్య రావటానికి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా,వేళకు తినకపోయినా కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది.

గ్యాస్ సమస్యకు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. తీవ్ర మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కారణం అవుతుంది. గ్యాస్ సమస్య అధికంగా ఉంటే ఛాతిలో, కడుపులో మంట అనేవి వస్తాయి. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

గ్యాస్ సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవాలి. రక్తంలో ఆమ్లత్వం ఎక్కువైతే యూరిక్ ఆమ్లంగా మారి కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. ఈ ఆమ్లతను అశ్రద్ధ చేస్తే పెద్ద పెద్ద సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా గ్యాస్ సమస్యను తగ్గించుకోవాలి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అరస్పూన్ జీలకర్ర వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి వడకట్టి తాగాలి. రోజులో 2 సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్ర గ్యాస్ సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది.

గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. జీలకర్ర మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.