MoviesTollywood news in telugu

Allu Arjun:అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకుండా ఉంటే ఏమి చేసేవాడో తెలుసా?

Tollywood hero Allu Arjun:గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైనా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. గంగోత్రి-పుష్ప మధ్య హిట్స్ ఫ్లాప్స్ చుసిన అల్లు అర్జున్ అసలు హీరో అవ్వాలని అనుకోలేదట. తన చిన్నప్పటి నుంచి నిలకడ లేని ఆలోచనలతో ఉన్న అల్లు అర్జున్, కెరీర్ పరంగా రకరకాలుగా ఆలోచించాడట.

మొదట్లో అల్లు అర్జున్ మ్యూజికల్ గా పియానో టీచర్ అవుదామని అనుకున్నాడట. తర్వాత మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవుదామని అనుకున్నాడట. తర్వాత యానిమేటర్ గానో…. విజువల్ ఎఫక్ట్స్ సూపర్ వైజర్ గానో అవుదామని అనుకున్నాడట. చివరకు నాసాలో సైంటిస్ట్గా మారాలని అనుకున్నాడట. ఇలా రకరకాల ఆలోచనలు చేసిన అల్లు అర్జున్ చివరకు 18 ఇయర్స్ అప్పుడు మాత్రం హీరోగా మారి సక్సెస్ అవ్వాలని కలలు కన్నాడట.
Tollywood hero Allu arjun
మరి తండ్రి సినిమాల్లో సూపర్ నిర్మాత…. అందుకే అల్లు అర్జున్ హీరో అవ్వాలనుకోవడంలో తప్పులేదు. మరి భారీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినా…. అల్లు అర్జున్ మాత్రం స్వశక్తితో ఎదిగాడు. అందుకే టాప్ డైరెక్టర్స్ తో టాప్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నాడు.