wrinkles:3 రోజుల్లో ముఖం మీద ముడతలు, మచ్చలు అన్నీ మాయం అయ్యి యవ్వనంగా ఉంటారు
wrinkles In Telugu : ముఖానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వంటింటిలో ఉండే వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక, సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాను పాటించటానికి ప్రయత్నం చేయండి. మంచి పలితం ఉంటుంది.
ముఖం మీద మొటిమలు,నల్లని మచ్చలు అధికంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా మార్కెట్లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలాగే వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ముడతలను తగ్గించుకోవచ్చు.
ఈ రెమిడీ కోసం జీలకర్రని ఉపయోగిస్తున్నాం.జీలకర్రను మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.జీలకర్రలో పొటాషియం, సెలీనియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలు, ముడతలు లేకుండా ముఖం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ జీలకర్ర పొడి, అరస్పూన్ అలోవెరా జెల్, అర చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి.
పావుగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముడతలు, నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. జీలకర్ర పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ మన ఇంటిలో చేసుకుంటేనే మంచిది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.