Kitchenvantalu

Gutti Vankaya Curry : గుత్తి వంకాయ కూర‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Gutti Vankaya Curry:గుత్తి వంకాయ కూరని ఓసారి ఇలా చేసి చూడండి.. చాలా రుచిగా సూపర్ గా ఉంటుంది..కూరల్లో రారాజు ఎవరంటే, ఎవరైనా చెప్పేది వంకాయే కదండీ.

గుత్తి వంకాయ చేస్తే,ఆహా ఏమి రుచి అనని వారెవరు ఉంటారండి.చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి.

కావాల్సిన పదార్థాలు

వంకాయలు – 1/4 kg
ఉప్పు – 1 టీ స్పూన్
పసుపు – 1/2 టీ స్పూన్
కారం – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి -2 టీ స్పూన్స్
జీలకర్ర పొడి – 1 /2 టీ స్పూన్
గరం మసాలా పొడి – 1 టీ స్పూన్
నూనె – 4 టెబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 1 ( మీడియం సైజ్)
టమాటా – 1 ( మీడియం సైజ్)
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – చిన్న కట్ట
పుదీనా – కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
జీడిపప్పులు – 10
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి – చిన్న ముక్క
చింతపండు – నిమ్మకాయ సైజ్
నీళ్లు – తగినన్ని

తయారీ విధానం

1. శుభ్రం చేసుకున్న వంకాయలు ,తొడిమ పై భాగం కొద్దిగా కట్ చేసుకోవాలి.

2. ఒక బాండీలో ఉప్పు,పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని, నాలుగు ముక్కులుగా కట్ చేసుకున్న వంకాయల్లో,స్టఫ్ చేసుకోవాలి.

3. స్టఫ్ చేసుకున్న వంకాయల్లో , తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు సన్నగా తిరిగిన కరివేపాకు,
కొత్తిమీర , పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ , పచ్చిమిర్చి, వేసుకుని, చివరగా రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని, వంకాయలకు బాగా పట్టేలా కలుపుకోవాలి

4. కలిపేసిన గిన్నెపై మూత పెట్టుకుని, పది నిముషాలు పక్కన పెట్టండి.

5. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో , నువ్వులు, ఎండు కొబ్బరి, జీడిపప్పులు, చింతపండు వేసి, కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, అన్ని కలిపి పక్కన పెట్టుకున్న వంకాయలను, మీడియం ఫ్లేమ్ పై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ, పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి.

7. మిగ్గిన వంకాయల్లోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేయాలి.

8. ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా , కలుపుకుని, మరో రెండు నిముషాలు ఉడికించాలి.

9. రెండు నిముషాల తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి, బాగా కలిపి మూత పెట్టి మరో మూడు నిముషాలు ఉడకనివ్వాలి.

10. మూడు నిముషాల తర్వాత , ఆయిల్ సెపరేట్ అవుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకుని,
కొత్తిమీర జల్లుకుంటే ఘుమ ఘుమ లాడే గుత్తివంకాయ రెడీ.