Kitchenvantalu

Leftover Rice Vada : రాత్రి మిగిలిన అన్నంతో ఉద‌యం అప్ప‌టిక‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Rice Vada:రైస్ వడా.. Leftover Rice Vada : రాత్రి మిగిలిన అన్నంతో ఉద‌యం అప్ప‌టిక‌ప్పుడు ఇలా వ‌డ‌ల‌ను వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..ఎంత జాగ్రత్తగా, అంచనా వేసి, ఆలోచించి వండినా, రోజూ అన్నం మిగిలిపోతూనే ఉంటుంది.

ఇది అందరి ఇళ్లలో జరిగేదే..మిగిలిపోయిన అన్నం పడేయలేం, అలా అని రోజూ తినలేం.కాబట్టి మిగిలిపోయిన అన్నంతో వేడి వేడి వడలు చేసేద్దాం.

కావాల్సిన పదార్థాలు

అన్నం – 2 కప్పులు
పెరుగు – 2 టేబుల్ స్పూన్స్
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
అల్లం తరుగు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
జీలకర్ర- 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

తయారి విధానం
1.ఒక మిక్సీ జార్లో అన్నం, పెరుగును యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2. గ్రైండ్ చేసే సమయంలో, పల్చగా చేయకుండా కొద్దిగా నీరు యాడ్ చేసుకోవాలి.

3. గ్రైండ్ చేసిన పిండిని మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.

4. అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

5. పిండి కాస్త మెత్తపడ్డాక, ఇప్పుడు అందులోకి, తరిగిన ఉల్లి పాయలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర,జీలకర్ర ,రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

6. స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసుకోవాలి.

7. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, రెండు చేతులను తడిపి, కలపిన మిశ్రమాన్ని వడలుగా చేతిపై వత్తుకోవాలి.

8.నూనె వేడెక్కిన తర్వాత అందులో వడలు వేసుకోవాలి.

9. మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా వడలను తిప్పుతూ, దోరగా వేయించుకోవాలి.

10.అంతే.. మిగిలిన అన్నంతో వేడి వేడి వడలు రెడీ.