Kitchenvantalu

Vankaya Aloo Curry:ఆలూ వంకాయ మసాలా కర్రీ అన్నంలోకి రుచిగా ఇలా చేయండి.. చపాతీ పులావ్ లోకి కూడా..

Vankaya Aloo Curry:ఆలూ వంకాయ మసాలా కర్రీ అన్నంలోకి రుచిగా ఇలా చేయండి.. చపాతీ పులావ్ లోకి కూడా.. ఆలు వంకాయ మసాల కర్రీ..కాంబినేషన్ కర్రీస్ లో ఆలు వంకాయ జోడి స్పెషల్.ఆ రెండింటికీ కాస్త మసాలా జోడిస్తే,టేస్ట్ అదుర్స్.స్పెషల్ డేస్ లో స్పెషల్ కర్రీ చేయాలనుకుంటే,ఆలు వంకాయ మసాల కర్రీ ట్రై చేయండి.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 4
బంగాళదుంపలు -3
టమాటలు-2
ఉల్లిపాయలు- 1
లవంగాలు- 4
చెక్క – ఒక ఇంచ్
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
మెంతులు – చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు -10
నూనె – నాలుగు టేబుల్ స్పూన్స్
తాలింపు గింజలు – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి -2
కరివేపాకు – ఒక రెమ్మ
ఉప్పు – తగినంత
పసుపు – 1/2టీ స్పూన్
కారం – 1 1/2టీ స్పూన్
గరం మసాల- 1/2టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం

1.ముందుగా బంగాళదుంపలు , వంకాయలు, టమాటాలు, శుభ్రంగా కడిగి,
ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి, అందులో లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి,
దోరగా వేయించుకోవాలి.
3. వేగిన మసాలా ధినుసులను మిక్సీ జార్లోకి వేసుకుని, అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
4. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి, అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు దోరగా వేయించుకుని,
గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టండి.
5. అదే ప్యాన్ లో వంకాయ ముక్కలు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
6.మిగిలిన ఆయిల్లో తాళింపు గింజలు వేసి చిటపటలాడుతుండగా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి.
7. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి.
8. ఉల్లిపాయలు వేగాక, టమాటా ముక్కలు వేసుకుని, తగినంత ఉప్పు వేసి పాన్ కి మూత పెట్టి, సిమ్ లో,
రెండు మూడు నిముషాలు మగ్గ నివ్వండి.
9.ఇప్పుడు అందులో పసుపు, కారం వేసి వేయించుకున్న బంగాళదుంపలు , వంకాయ ముక్కలు బాగా కలపాలి.
10. అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న, మసాలా పొడి వేసుకుని బాగా కలపి, గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
11. ఉప్పు, కారం , టేస్ట్ చూసుకుని లో ఫ్లేమ్ లోపెట్టి, మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేవరకు ఉడకనివ్వాలి.
12. ఇప్పుడు మూత తీసి, చివరగా గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ.